హైదరాబాద్ : మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయ వేదిక సలహాసంఘం అధక్ష్యడు జేమ్స్ బోల్గార్ ఈరోజు మధ్యాహ్నం ఇక్రిశాట్‌ను సందర్శించనున్నారు.




