హైదరాబాద్ : తమ పార్టీని లక్ష్యంగా చేసుకునే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారన్న తెదేపా వ్యాఖ్యలు సమంజసం కాదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మంత్రుల కమిటీపై తెదేపా విమర్శలు చేయడం తగదన్నారు. ఆంటోని కమిటీని పార్టీ కమిటీ అంటూ గతంలోనే తెదేపా వ్యతిరేకించిందని ,ఇప్పుడు మంత్రుల కమిటీపై కూడా వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సీమాంధ్ర ,తెలంగాణ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా నివేదిక ఇస్తుందన్నారు.




