హైదరాబాద్ : శైవక్షేత్రాలు శివనామ స్మరణలతో మార్మోగుతాయి. కార్తిక మాసం ప్రారంభం ,తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివ దర్శనం కోసం పలు శైవ క్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. పుణ్యక్షేత్రాల్లోని కోనేర్లు, నదుల తీరాలు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తీ క పౌర్ణమి దీపాలను నదుల్లో వదులుతున్నారు.




