హైదరాబాద్ : తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ ప్రాంత మంత్రులు నేతలతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బేటీ ముగిసింది.ఇవాళ మంత్రుల నివాస ప్రాంగంణంలో సమావేశమైన నేతలు తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒకే నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను కోరారు. ఆ వెంటనే తెలంగాణ నేతలు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో సమావేశమై చర్చిస్తున్నారు. 11 అంశాలపై నివేదిక తయారు చేస్తున్నారు.




