అబ్దుల్లాపూర్‌మెట్ ( హైదరాబాద్ ) : పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు కూడలి సమీపంలో రింగ్‌రోడ్డు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. రహదారి పనులలో భాగంగా రోడ్డుపై పోసిన మట్టిదిబ్బను ద్విచక్రవాహనం ఢీకొని భీసింగ్ అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడు రాజస్థాన్ వాసిగా గుర్తించారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఔటర్ రింగ్‌రోడ్డు పైకి ద్విచక్రవాహనం ఎలా వెళ్లిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




