హైదరాబాద్ : ఇవాళ్టి ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద తనిఖీలు నిర్వహించిన నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 12 బస్సులను సీజ్ ఛేశారు. కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద 4 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. కడప జిల్లాలో 16 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.




