Tuesday, 3 November 2026

స్కూల్‌ ఆఫ్‌ సౌండ్‌ను ప్రారంభించిన చక్రి

హైదరాబాద్‌ : సినీ, టీవీ రంగానికి నిపుణులైన సౌండ్‌ ఇంజినీర్ల అవసరం చాలా ఉందని సినీ సంగీత దర్శకుడు చక్రి అన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఆహుజా పంచీ స్కూల్‌ ఆఫ్‌ సౌండ్‌ ఇనిస్టిట్యూట్‌ను చక్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ధ్వని పరికరాలను వినియోగించి సంగీత ప్రియులకు నాణ్యమైన సంగీతాన్ని అందించాల్సిన అవశ్యకత ఉందన్నారు. అనంతరం పలువురు యువ గాయనీ గాయకులు పాటలు పాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *