హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం హోదాలో తప్పుడు నివేదికలిస్తూ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సీఎం కిరణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ సరూర్‌నగర్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది.




