హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ,తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించింది. పెనుమాకలో వరద నష్టం వల్ల దెబ్బతిన్న ఉల్లి, సొర, బీర , పసుపు పంటలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు జిల్లాలో రూ.1178.81 కోట్ల మేర నష్టం వాటిల్లిందని జిల్లా యంత్రాంగం కేంద్ర బృందానికి సమర్పించింది.




