సోమాజిగూడ, హైదరాబాద్ : విద్యావేత్త చుక్కారామయ్య అనుభవాలతో రచించిన ‘రామయ్య జ్ఞాపకాలు’ అనే తెలుగు పుస్తకానికి ఆంగ్ల అనువాదం ‘రామయ్య మెమొరీస్’ పుస్తకాన్ని ఈ రోజు సోమాజిగూడలోని ప్రెస్‌క్టబ్‌లో అవిష్కరించారు. రామయ్య 87వ జన్మదినం సందర్భంగా పుస్తకాన్ని ఆయన తోటి ఉపాధ్యాయుడు, స్నేహితుడు తొలిదేవర వెంకటరావు కుమారుడు భానుమూర్తి ఆవిష్కరించారు. ఈ సభకు రచయిత జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి పొత్తూరి వెంకటేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, విమలక్క పద్మాచారి, రాజేంద్రబాబు, విజయరాజం, మల్లేపల్లి లక్ష్మయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.




