హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల విభాగంలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. కాగజ్ నగర్ మండలం చింతగూడకు చెందిన రైసాభాను ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు వినతి పనతిపత్రం అందజేసిన కొద్దిసేపటికే అక్కడే పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు యత్నించింది. అధికారులు వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే .. కాటజ్ నగర్ మండలం సొంత గ్రామానికి చెందిన అశోక్, రైసాబాను గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అశోక్ పెళ్లికి నిరాకరించడంతో కాగజ్ నగర్ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఎసై తిరుపతికి ఫిర్యాదు చేసింది. ఆయన స్పందించి గ్రామస్థులతో చర్చలు జరిపారు. తన మేనకోడలి పెళ్లి తరువాత రైసాబానును పెళ్లి చేసుకుంటానని గ్రామ పెద్దల సమక్షంలో అశోక్ అంగీకరించాడు. కొంత కాలం తన మేనకోడలి పెళ్లి జరిగినా తప్పించుకు తిరుగుతున్నాడని మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో ఇటీవల అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎసై సమక్షంలో సాక్షులుగా ఉన్న గ్రామ పెద్దలు నలుగురిని కూడా అరెస్టు చేయాలని రైసాబాను కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించింది.




