Monday, 2 November 2026

ప్రభుత్వానికి సవాలు విసురుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు: సీఎం

హైదరాబాద్‌: ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు అటవీ ఉత్పత్తుల అక్రమాలు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న వారికి సహకరిస్తూ స్మగ్లర్లను అదుపుచేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అటవీశాఖ అధికారుల రెండు రోజుల సదస్సును ఆయన ఈ రోజు ప్రారంభించారు. అడవులను నాశనం చేస్తే తిరిగి తయారు చేయడం కష్టమని అందుకే వాటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం అన్నారు. అటవీ శాఖ సమస్యలు, ఆధునిక అవసరాలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఈ సదస్సులో చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *