ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వసుంధర రాజె ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు దుశ్యంత్ సింగ్‌తో కలిసి ఆమె జలావర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈ సారి ప్రజలు భాజపాపై మొగ్గుచూపుతారని ఆమె అన్నారు.




