హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీగా బయలు దేరడంతో పోలీసులు భారీగా మోహరించారు. పంగల్ రోడ్డు వద్ద భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. అయితే వారు ప్రతిఘటించి నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఓ వైపు పోలీసులు…మరోవైపు విద్యార్థుల తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పోలీసులు కొంత మంది విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.




