హైదరాబాద్: జగన్ 24 గంటల సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సోనియా వద్ద విభజనకు అంగీకరించి…ఇప్పుడు సమైక్యాంధ్ర ముసుగులో జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ బెయిల్‌కు లింకు పెట్టే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని యనమల ఆరోపించారు. సోనియా, కేసీఆర్, జగన్‌లు మంతనాలు జరిపే రాష్ట్ర విభజనపై ఓ నిర్ణయానికి వచ్చారని యనమల తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలే జరుగుతున్నాయని యనమల ధ్వజమెత్తారు.




