హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్లకిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించేందుకు తెదేపా ఆధ్వర్యంలో సమైక్యవాదులు విఫలయత్నం చేశారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యవాదులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఆందోళనలో తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గ ఇన్ ఛార్జి రామ్మోహన్ నాయుడు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితో సహా పలువురు సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపైవిడుదల చేశారు.




