హైదరాబాద్: రాష్ట్ర విభజనతో నీటి పంపిణీ కష్ట మవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం, లాంటి ప్రాజెక్టులను నిర్మించుకోగలిగామన్నారు. విభజన జరిగితే ప్రాజెక్టుల నిర్మాణం కష్టమవుతుందన్నారు.




