హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ ముగిసింది. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ద్విగ్వజయ్‌సింగ్‌తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.




