హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడిలో కేంద్ర మంత్రి కావూరికి సమైక్య సెగ తగిలింది. కొందరు వైకాపా కార్యకర్తలు కావూరిపై కోడిగుడ్లు విసిరారు. దీంతో వైకాపా, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.




