Wednesday, 4 November 2026

అసెంబ్లీలో లాబీలో నేతల మధ్య సంభాషణ

హైదరాబాద్‌: అసెంబ్లీ లాబీలోని చంద్రబాబు ఛాంబర్‌ వద్ద మంత్రులు కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంత్‌కుమార్‌, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెదేపా నేతలు రేవంత్‌ రెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 2014 ఎన్నికలకు ముందు తెరాస కాంగ్రెస్‌లో విలీనమవుతుందని కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి డబుల్‌ గేమ్‌ ఆడుతూ…కేంద్రం కనుసన్నలలో నడుస్తున్నారని ఆయన కాసు కృష్ణారెడ్డితో అన్నారు. అధిష్ఠానం వద్ద విభజనకు తలాడించి ఇక్కడ సమైక్య వాణి వినిపిస్తున్నాడన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రతి సమావేశం తెలంగాణకు అనుకూలమేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కిరణ్‌ అధిష్ఠానాన్ని ధిక్కరించి ఉంటే ఈ పాటికి చంచల్‌ గూడ జైల్లో ఉండేవారన్నారు. దీనిపై మంత్రి కాసు స్పందిస్తూ 60 ఏళ్లు కాపురం చేశాక విడాకులు ఇస్తామంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఎవరు పెళ్లి చేసుకుంటారని వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి తెలంగాణ అని పేరు పెట్టి సమైక్యంగా ఉండవచ్చు కదా అని కోమటిరెడ్డిని కోరారు. ఇంతలో రేవంత్‌ రెడ్డి కల్పించుకుని కిరణ్‌ కుమార్‌ రెడ్డి తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయునా రాష్ట్రం సమైక్యంగానే ఉండేదాన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీమాట ఉన్నాడు కాదా! అంటూ జైపాల్‌ రెడ్డిని ఉద్దేశించి కాసు వ్యాఖ్యానించగా…. కోమటిరెడ్డి కల్పించుకుని దళిత ముఖ్యమంత్రి దామోదర్‌ తమ వద్ద సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *