హైదరాబాద్: టీఎన్‌ఎన్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని నారా లోకేష్ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నేతల అవినీతి వల్లే ధరలు పెరిగాయన్నారు. 2004 తర్వాత ఫ్యాబ్ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆదాయం పెరిగిన స్థాయిలో ఉద్యోగాలు ఎందుకు పెరగలేదని? ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు నాయుడిపై 37 కేసులు పెట్టారు. ఒక్కటీ నిరూపించలేకపోయారని విమర్శించారు. అవినీతి క్యాన్సర్‌లాంటిది…యువత, ప్రజలకు నష్టం చేకూరుస్తుందని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లంచం అడుగుతున్నారని వ్యాపారులు వాపోతున్నారని లోకేష్ చెప్పారు. అవినీతి వల్ల యువత ఉపాధి కోల్పోయి నిరుద్యోగులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.




