హైదరాబాద్: తమ సేవలను క్రమబద్దీకరించాలంటూ ఇందిరా పార్కు వద్ద ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక కార్మికుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఇతర కార్మికులు అడ్డుకున్నారు.అనంతరం వారు అసెంబ్లీ వైపు బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో పాటు పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.




