Tuesday, 3 November 2026

అన్ని పార్టీలు సమైక్యంగా ముందుకెళ్లాలి: అశోక్‌ బాబు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినందుకు అన్ని పార్టీలు ఒకే మాటపై వెళ్లాలని నిర్ణయించినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఏపీఎన్జీవో హోం ఏర్పాటు చేసిన అఖిలపక్ష
సమావేశం ముగిసింది. అనంతరం అశోక్‌ బాబు మాట్లాడుతూ… అవసరమైతే రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలోని 158 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. రెండు మూడు రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతిని కలిసే అంశంపై చర్చిస్తామని తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ… విభజన బిల్లును వ్యతిరేకించడంపై రాజకీయ పార్టీలన్నీ సమైక్యంగా ముందు కెళ్లాలని కోరారు. మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ… క్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా పనిచేయాలని విఙ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఐక్యతకు అన్ని పార్టీలు సహకరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
సమావేశానికి హాజరైన నాలుగు పార్టీలు
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, కె.ఇ. ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నుంచి పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, వై. వెంకటేశ్వరరావు, లోక్‌ సత్తా నుంచి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రవి మారుత్‌ హాజరయ్యారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌ బాబు అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశానికి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు.

ఏ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *