Tuesday, 3 November 2026

అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతాం:సబ్బం హరి

హైదరాబాద్‌: అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఏపీఎన్జీవో హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సబ్బం హరి మాట్లాడుతూ… ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు చూసిన తర్వాత రాష్ట్రపతి పునరాలోచిస్తామని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున విభజన ద్వారా లబ్దిపొందాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయని విమర్శించారు. తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాల వల్లే పార్లమెంట్‌ రెండ్రోజుల ముందు వాయిదా వేసి పారిపోవాల్సి వచ్చిందన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని, అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందేనన్నారు. ఆందోళనల్లో అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఒక నిర్ణయం తీసుకున్న పార్టీలను ప్రశ్నించలేమన్నారు. హైదరాబాద్‌: అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపుతామని ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఏపీఎన్జీవో హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న సబ్బం హరి మాట్లాడుతూ… ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు చూసిన తర్వాత రాష్ట్రపతి పునరాలోచిస్తామని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున విభజన ద్వారా లబ్దిపొందాలని జాతీయ పార్టీలు భావిస్తున్నాయని విమర్శించారు. తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాల వల్లే పార్లమెంట్‌ రెండ్రోజుల ముందు వాయిదా వేసి పారిపోవాల్సి వచ్చిందన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని, అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందేనన్నారు. ఆందోళనల్లో అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఒక నిర్ణయం తీసుకున్న పార్టీలను ప్రశ్నించలేమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *