హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ 128వ వ్యవస్థాపక దినోత్సవ గోడపత్రిక ను కరీంనగర్‌లో ఆ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ 128వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో సోనియా గాంధీ ధన్యవాద సభను నిన్వహిస్తున్నట్లు చెప్పారు.




