హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. బేగంపేటలోని పాఠశాల ఆవరణలో ప్రదర్శించిన వివిధ రకాల కార్లు అలరించాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటి కార్లు, నిజాం కాలంలో వాడిన కార్లు ఆకట్టుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన సుమారు 40 రకాలకు పైగా కార్లు ఈ ప్రదర్శనలో చిన్నారులను ఉత్తేజపరిచాయి. ప్రదర్శన అనంతరం పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వింటేజ్ కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఎంపీ వివేక్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




