హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత శ్రీరాం భార్య మంత్రి శ్రీధర్ బాబు పై చేసిన ఆరోపణలను మంత్రి కరీంనగర్‌లో ఖండించారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని … తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారనే ఆరోపణపై శ్రీరాంను అరెస్టు చేసిన పోలీసులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని అతని భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.




