Tuesday, 3 November 2026

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

ఆలేరు : నల్గొండలో బిటెక్‌ విద్యార్థిని అరుణ హత్యకేసులో నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నల్గొం జిల్లా పాలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళుతున్న కేంద్రమంత్రి బలరాంనాయక్‌ కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. బలరాంనాయక్‌ మాట్లాడుతూ… యువకులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి మరింత కఠినతరమైన చట్టాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తామని చెప్పారు. అరుణ హత్యకు పాల్పడిన వారికి వెంటనే శిక్షపడేలా జిల్లా పోలీస్‌ యంత్రాంగం పై వత్తిడి తెస్తామని చెప్పారు. మంత్రి హామీతో విద్యార్థులు శాంతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *