Tuesday, 3 November 2026

పార్టీలకు భూకేటాయింపులపై హైకోర్టుకు నివేదిక

హైదరాబాద్‌ : పార్టీలకు భూ కేటాయింపుల పై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. భూకేటాయింపులపై వివరణ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.అలాగే భూ కేటాయింపులు ఎలా చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిచింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ రోజు కోర్టుకు హాజరై నివేదిక సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *