Tuesday, 3 November 2026

డయేరియా బారినపడి ఇద్దరి మృతి

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లోదెడ్డి పంచాయతీ పాతవెల్తి గ్రామంలో డయేరియాతో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. కేశవరం గ్రామంలో డమేరియా బారినపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108లో మెరుగైన వైద్యం నిమిత్తం గెడ్డంగి ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్నారు. వైద్యాధికారి శ్రీరామ్‌ పంచాయితీలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *