హైదరాబాద్ : పాలెం బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందంటే తాను అరెస్టు కావడానికి సిద్ధమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. తాను అరెస్టయినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదని…వాళ్లకు చెల్లించే నష్ట పరిహారం కోసం అందరితో కలిసి పోరాడుతున్నట్లు ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు బస్సులతో ట్రావెల్స్ నిర్వహించడం తనవల్ల కాదని వచ్చే ఏడాది మార్చి లోగా తనకున్న బస్సులన్నింటినీ అమ్మేయడానికి సిద్ధపడుతున్నట్లు జేసీ వెల్లడించారు. అంతే కాకుండా వైఏస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనన్న కథనాలు అవాస్తవమని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి పిలుపులు ఉన్నాయని జిల్లా ప్రజలు, కార్యకర్తల మనోభీష్టం మేరకు ఏదో ఒక పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.




