హైదరాబాద్ : గుంటూరు జిల్లా పరసారావు పేట మండలం కాకాని సమీపంలో ఉన్న అజంతా స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్పిన్నింగ్ మిల్లులో భారీగా నిల్వలు ఉండటంతో సుమారు రూ. 6కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుదని అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.




