హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసంలో నూతన సంవత్సర సంబరాలు మిన్నంటాయి. ఉదయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇతర సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించా. మధ్యాహ్నం నుంచి రాజేంద్రనగర్ మురికివాడలో మహిళలతో కలిసి నేతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.




