సంగారెడ్డిమున్సిపాలిటీ: హిందువుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాదక్షులు ప్రవీణ్ తొగాడియా అన్నారు. సోమవారం ఉదయం మాజీ మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు అన్ని రంగాల్లో వెనుకపడుతున్నారని, అందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం కార్యకర్తలు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ కార్యదర్శి గోపాల్, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, విభాగ్ ధర్మ ప్రచారక్ రామ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.




