Tuesday, 3 November 2026

సమ్మెకు దిగిన ఆటో డ్రైవర్లు

– శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటోలబంద్‌

హైదరాబాద్‌: శక్రవారం అర్థరాత్రి నుంచి జంటనగరాల్లో ఆటోలు బంద్‌ కానున్నాయి. మీటర్‌ ఛార్జీలు పెంచాలని రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటోడ్రైవర్ల ఐకాస నిర్ణయిచింది. కనీస చార్జీని 16 నుంచి 25 రూపాయలకు పెంచాలని ఆపై ప్రతి కిలోమీటర్‌కు ప్రస్తుతం ఉన్న 9 రూపాయల నుంచి 13 రూపాయలకు పెంచాలని ఆటో డ్రైవర్ల ఐకాస డిమాండ్‌ చేస్తోంది. ఈ సమ్మెలో 16 ఆటో సంఘాలు పాల్గొంటున్నాయని ఐకాస ప్రతి నిధులు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాదగ్‌ ప్రెస్‌క్లబ్‌లో అన్ని ఆటో సంఘాలతో సమ్మె సన్నాహక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *