Tuesday, 3 November 2026

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌:శాసనసభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు కూడా సభలో చర్చ కొనసాగింది.రెండు సార్లు కొద్ది సమయం కోసం వాయిదా పడిన శాసనసభలో సాయంత్రం వరకూ చర్చ కొనసాగింది. సాయంత్రం సభను రేపటికి వాయిదా వేయాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఉప సభాపతి ముందు ప్రతిపాదించారు. మరో గంటపాటు కొనసాగించాలని నాగం జనార్ధన్‌ కోరారు. చర్చకు అదనపు సమయాన్ని కేటాయంచేందుకు ఇప్పటికే రాష్ట్రపతిని కోరామని మరో సభ్యుడు కన్నబాబు తెలిపారు. ఉపసభపతి మల్లుభట్టి విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *