Tuesday, 3 November 2026

చురుకుగా నాగోబా జాతర ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, జనవరి24: ఆదిలాబాద్‌ పేరు చెప్పగానే ప్రథమంగా గుర్తుకు వచ్చేది నాగోబా జాతరే. ఈ జాతరకు లక్షలాదిగా గిరిజనులు వివిధ ప్రాంతాల నుంచి, సరహద్దు రాష్ట్రల నుంచి తరలి వస్తారు. ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆదివాసుల నాగోబా జాతర ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. కేస్లాపూర్‌ నాగోబా జాతరలో వ్యాపారులు వేసే దుకాణాల సముదాయం, ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేసే స్థలాన్ని ఉట్నూర్‌ ఆర్‌డీఓ సముద్రాల రాంచంద్రరావు పరిశీలించారు. ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఉట్నూర్‌ ఏఎస్పీ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. జాతరలో ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. బందోబస్తుపై పోలీసులకు పలు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *