Wednesday, 4 November 2026

ఉమ్మడి అభ్యర్థులకు ఒకేచోట పరీక్ష కేంద్రం

ఆదిలాబాద్‌, జనవరి24: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు హాజరయ్యే ఉమ్మడి అభ్యర్థులకు అధికారులు వెసలుబాటు కల్పించారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ రెండు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఉమ్మడి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 794 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి హాల్‌టికెట్లు జారీ చేసినందున వీఆర్‌ఓ పరీక్ష ఒక ప్రదేశంలో, వీఆర్‌ఏ పరీక్ష మరొక ప్రాంతంలో కేంద్రాలను కేటాయించారు. దీంతో సుమారు వందమంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షను రాయలేకపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్‌ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. అటువంటి అభ్యర్థుల వివరాలు సేకరించి పంపిస్తే ఒకే చోట పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని హావిూ ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు వేర్వేరు చోట్ల పరీక్ష కేంద్రాలు కేటాయించబడితే అలాంటి అభ్యర్థులు శనివారం సాయంత్రంలోగా వారి వివరాలు అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూశాఖ అధికారి పేరు విూద ఆయన కార్యాలయానికి అభ్యర్థులకు కేటాయించిన రెండు హాల్‌టికెట్లు, ధ్రువపత్రాలకు సంబంధించిన జిరాక్స్‌ ప్రతులను జతపర్చాలని సూచించారు. అభ్యర్థులు వ్యక్తిగతంగానైనా నిర్ధేసిరచిన గడువులోగా అందజేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇచ్చిన వివరాలను అదే రోజు సాయంత్రం సీసీఎల్‌ఏ కమిషనర్‌కు పంపించనున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *