హైదరాబాద్: శాసనసభలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రాజ్యంగ ఉల్లంఘన అనే పదం వాడటం పై స్పీకర్ వివరణ ఇచ్చారు. చర్చ మొత్తం రాజ్యంగానికి లోబడే జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన అనే మాటకు స్థానం లేదని పేర్కొన్నారు. శాసనసభ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందని చెప్పారు. ఏ సభ్యుడైనా స్వేఛ్చగా తన అభిప్రాయాలను వెల్లడించాలని తెలిపారు.




