నువ్వుపో అంటే నువ్వేపో అని విమర్శ
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సినియర్ కాంగ్రెస్
నేత జేసీ దివాకర్రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధైర్యముంటే పార్టీ విడిచిపోవాలని జేసిని ఉద్దేశించి అనడంతో నేను వెళ్ళను నువ్వే వెళ్లిపో అని జేసీ తీవ్రంగా స్పందించారు. 26 మంది ఎమ్మెల్యేలతో లాలూచీ పడ్డావని బొత్సను జేసి విమర్శించారు. లాలూచీపడాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు.




