హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల అంశాన్ని బిల్లులోనే ప్రస్తావిస్తేనే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలుండవని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ పాలనను దేశ ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్నవాళ్లను ఎక్కడికి పొమ్మని అనే హక్కు ఎవరికి ఉండదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముందే సోనియాకు చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదన్నారు. సోనియానే వారి మాట వినకుంటే బీజేపీ ఎలా వింటారని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా రావాలని దేశమంతా కోరుకుంటుందని ఆయన చెప్పారు.




