హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.. ఏఎస్ఐలకు శుభవార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్రశంసనీయమైన కృషి, అవిశ్రాంత సేవలు, అంకితభావాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కృషి, సేవలకు గుర్తింపుగా.. 75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పించినట్లు డీజీపీ అంజనీ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి.. డీజీపీ ట్వీట్




