న్యూఢిల్లీ: ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ఆగదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీఎం కిరణ్‌కు నైతిక విలువలు ఉంటే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. సీఎం వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను కించపర్చేలా ఉందని తెలిపారు. సీఎం వైఖరిని తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తామన్న మాటను సోనియాగాంధీ నిలబెట్టుకుందని చెప్పారు. కిరణ్ ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ కల నిజం కాబోతుందని తెలిపారు. సీపీఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతిస్తున్నాయని, తెలంగాణ వస్తున్న సమయంలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నాడు. యావత్ తెలంగాణ ప్రజలను సీఎం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ ఒక ప్రాంతానికే నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. హైకమాండ్ అన్ని విషయాలు గమనిస్తోందని తెలిపారు. సరైన సమయంలో సీఎంపై సరైన చర్య తీసుకుటుందని, ఎప్పుడేం చేయాలో మాహైకమాండ్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లుపై కుట్రలు పనికి రావు : డిప్యూటీ సీఎం రాజనర్సింహ




