Wednesday, 4 November 2026

హోరాహోరీగా పార్టీల ప్రచారం!

ఆదిలాబాద్‌, మార్చి 15: జిల్లాలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో అన్ని రాజకీయపార్టీలు ప్రచారానికి దిగాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 189 వార్డులకు గాను మొత్తం 1,877 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌ మున్సిపల్‌లోని 36వార్డులకు గాను 498 నామినేషన్లు దాఖలు కాగా, మంచిర్యాలలో 32వార్డులకు 385 బైంసా మున్సిపల్‌లో 23 వార్డులకు 136 నిర్మల్‌లో  36వార్డులకు 333, కాగజ్‌నగర్‌లో 28వార్డులకు 221నామినేషన్లు, బెల్లంపల్లిలో 34వార్డులకు 304 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్‌లో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని రాజకీయపార్టీలు నామినేషన్‌ చివరి రోజైన శుక్రవారం జాబితా ప్రకటించడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ టికెట్ల కోసం ఆశించిన అభ్యర్థులు టికెట్‌ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగారు. జిల్లాలోని ఆరుమున్సిపాలిటీలలో ఐదు మున్సిపాలిటీలను మహిళలకు కేటాయించడంతో మహిళలకు కూడా రిజర్వేషన్లుకల్పించిన వార్డులతో పాటు జనరల్‌ వార్డుల్లో కూడా పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అన్ని రాజకీయపార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *