అదృశ్యమైన విమాన విషయంలో కొత్త సమాచారం
అందించిన ఆస్ట్రేలియా
హైదరాబాద్: ఇంటర్నేట్ డెన్క్,: అదృశ్యం అయిన మలేసియా విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బోట్ కొత్త సమాచారం వెల్లడించారు. దక్షిణ తీరప్రాంతంలోని సముద్రంలో రెండు విమాన శకలాలు గుర్తించినట్లు టోనీ అబ్బోట్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు తెలిపారు. ఈమేరకు మలేసియా ప్రధానికి ఫోన్లో సమాచారమందించినట్లు అబ్బోట్ వ్యక్తం చేశారు. గుర్తించిన శకలాలు అదృశ్యమైన విమానానికి చెందినవిగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. శకలాలు గుర్తించిన ప్రాంతానికి వెళ్లేందుకు మూడు విమానాలు సిద్దం చేశామని, ఆ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం అస్పష్టంగా ఉండటంతో కొంత ఇబ్బంది జరుగుతున్నట్లు వెల్లడించారు




