80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు
పటాన్చెరు సెప్టెంబర్ 19(జనం సాక్షి)
పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున కానుకను అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో విధులు నిర్వహిస్తున్న 80 మంది పాత్రికేయులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందించారు.సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జర్నలిస్టుల సోదరులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకమని అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారంలో సైతం ముందుంటున్నారని అభినందించారు.
జిఎంఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం పట్ల జర్నలిస్టులు పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, వంగరి అశోక్, మెరాజ్ ఖాన్, నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Attachments area