అక్టోబర్ 9న నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారిగా కే పాపిరెడ్డి, అదనపు ఎన్నికల అధికారులుగా మహ్మద్ ముజాఫరుల్లాఖాన్, కొండూరు వినోద్‌కుమార్‌ను నియమించినట్టు అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బీ కొండారెడ్డి, చింతల కృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 26 వరకు నామినేషన్ పత్రాలు తీసుకొని, 28, 29లలో నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని చెప్పారు.




