Monday, 2 November 2026

9న తెలంగాణజాతి విద్రోహదినం

హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి నిరసన ప్రదర్శనలు, దీక్షా శిబిరాలు ప్రారంభిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు ప్రకటించారు. ఏపీఎన్జీవో భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 7న గుంటూరులో అన్ని సంఘాలతో సమావేశమై చర్యిస్తామన్నారు. గుంటైరు సమావేశంలో చర్యించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీ ముట్టడిచేసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఈ నెల 9న తెలుగు జాతి విద్రోహదినాన్ని అన్ని జిల్లాలో పాటిస్తామన్నారు. ఆ రోజున సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహిస్తామని అశోక్‌ బాబు చెప్పారు. ఉద్యమాన్ని మోయమని తాము రాజకీయ నాయకులను కోరడం లేదని, రాష్ట్రాన్ని విభజించినా, కలిసున్నా రా.కీయ పార్టీలే పాలన సాగిస్తాయన్నారు. సభ్యులు ఇచ్చిన హామీ మేరకు సమైక్యానికి నిలబడాలని మళ్లీ కోరతామని చెప్పారు. ప్రస్తుతం శసన సభ్యులు వివ్‌లు ధిక్కరించే పరిస్థితి ఉందన్నారు. అఖిలపక్ష భేటీ తేదీ ఖరారైన తర్వాత తెరాసను కూడా కలుస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *