Wednesday, 4 November 2026

ఘనంగా ఇందిరాగాంధీ 96వ జయంతీ వేడుకలు

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతీ వేడులు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్‌ వద్ద ఇందిరాగాంధీ స్మారక స్థూపానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ , రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమల వేసి నివాళులర్పించారు. గాంధీభవన్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ , సర్వే సత్యనారాయణ , దానం నాగేందర్‌, వి. హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *