_ఘనంగా సమైక్యత వజ్రోత్సవ ప్రారంభోత్సవ ర్యాలీ..

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జెండా ఊపి ప్రారంభించిన వజ్రోత్సవ ర్యాలీ అదనపు కలెక్టర్ రాజాశ్రీ_
_జనం సాక్షి జోగిపేట్ ఆందోల్  ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజు సెప్టెంబర్ 17_
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
_జనం సాక్షి జోగుపేట ఆందోల్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ సమైక్యత వజ్రోత్సవాల భాగంగా జోగుపేట ఎన్టీఆర్ స్టేడియంలో నియోజకవర్గ కేంద్రంలో 15వేల మందితో నిర్వహించిన భారీ ర్యాలీని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సంగారెడ్డి  జిల్లా అదనపు పాలనాధికా రాజశ్రీ ర్యాలీ ని ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండ అందరితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో  ఏర్పాటుచేసిన వేదికపై పలువురు వక్తలు ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ 1947 సంవత్సరంలో భారతానికి స్వతంత్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ మాత్రం రజాకార్ల నిర్బంధంలో అల్లాడిందని నాటి సాయుధ పోరాట వీరుల త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న మిలిటరీ సైన్యంతో తెలంగాణకు రావడంతో తెలంగాణ ప్రజలు పూల వర్షంతో  భారత ఆర్మీ ని ఆహ్వానించడంతో నిజాం రాజు తలోంగి భారతావనికి తెలంగాణ రాష్ట్రానికి అప్పగించడం జరిగిందని అన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటగడ్డ ఆందోల్ మొట్టమొదటి ఎమ్మెల్యే బసవ మా మా న్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము అని అన్నారు బసవమనే యుగానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెగువకు వెనకాడని నైజం ఉన్నవారే తెలంగాణ శంకరమ్మముద్దుబిడ్డలని అన్నారు ఉద్యమాలు మన గడ్డకు కొత్త కాదని అన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుండి హక్కుల కోసం కొట్లాడుతూనే ఉన్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని సీఎం కేసీఆర్ సారాధ్యంలో బసవశిర చౌక్ టవర్ అంబేద్కర్ మీద భారీ ర్యాలీ సాగిందని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దేశానికి దిక్సూచిగా ప్రయాణిస్తున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్  సంక్షేమ పథకంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అన్నారు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పథకం ఏదో ఒక రూపంలో అందుతుందని తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఇంట ఆనందోత్సాహం నింపిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారితో పాటు నృత్యం చేసి విద్యార్థులను ఉత్తేజపరిచారు అనంతరం కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన అదర పాలనాధికారి మున్సిపల్ అధికారి  సన్మానించారు.అందరూ అధికారులు ప్రజా ప్రతినిధులు దగ్గరుండి కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసిన వారి అందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఆందోల్ మున్సిపాలిటీ చైర్మన్ గూడెం మల్లయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున గుప్తా ఎంపీపీ బాలయ్య తెలంగాణ రాష్ట్ర జాగృతి జిల్లా అధ్యక్షులు  మఠం బిక్షపతిమునిపల్లి మండలం జెడ్పిటిసి సాయిలు కుమార్ ఆయా మండల ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు మహిళా గ్రూపుల సభ్యులు ఆయా పాఠశాల విద్యార్థులు అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు._